LIVE: అప్పులు చేసి సొంత కాంట్రాక్టర్లకు పంపకం - టీడీపీ వర్ల రామయ్య మీడియా సమావేశం లైవ్ - TDP Varla Ramaiah Press Meet
🎬 Watch Now: Feature Video
TDP Varla Ramaiah Press Meet Live: అందినకాడికి అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటివేసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారని ఆరోపించారు. చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్బీఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్ల అప్పులకు దరఖాస్తు చేసిందని మండిపడ్డారు. ముందు బిల్లులు ముందే చెల్లించాలన్న సీఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు తెస్తున్న 4వేల కోట్లు అప్పులు సైతం కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారన్నారని తెలిపారు. ఆర్.బి.ఐ ద్వారా తెస్తున్న రూ4 వేల కోట్ల అప్పులను తనసొంత కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి పంచిపెట్టబోతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jun 3, 2024, 1:23 PM IST