Lokesh Help to Farmers in Tirupati District: మంత్రి లోకేశ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని మరోసారి నిరూపించారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలను ఇప్పటికే లోకేశ్ పరిష్కరించారు. తాజాగా మరో సమస్యను పరిష్కరించి ఎంతోమంది రైతులకు అండగా నిలిచారు. దీంతో ఆ రైతులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఆరుగాలం శ్రమంచి పంట పండించే రైతన్నకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కాపులూరు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాపులూరులో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు కింద పలువురి రైతుల భూములను అధికారులు సేకరించారు.
అయితే తమ పొలాల్లో వరి పంట వేశామని, మరో 20 రోజుల్లో కోతకు వస్తుందని, పంట చేతికి అందేవరకు సమయమివ్వాలని అధికారులను రైతులు వేడుకున్నారు. ప్రొక్లెయిన్‌తో తమ పొలాల్లోని పంటను ధ్వంసం చేసేందుకు యత్నించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లటంతో వెంటనే స్పందించారు. పంటను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని, పంట పూర్తయ్యే వరకు రైతులకు సమయమివ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
దీంతో ఫిబ్రవరి 5వ తేదీ వరకు అధికారులు సమయమిచ్చారు. సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి అండగా నిలిచిన మంత్రి నారా లోకేశ్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
This is unacceptable. @officeofNL, please look into this matter and ensure that farmers receive the care and support they deserve. https://t.co/x22NYQFrR3
— Lokesh Nara (@naralokesh) January 2, 2025
ఇక చాలీచాలని ఆదాయాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేకేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
Lokesh Financial Support to Student Basavaiah : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపు గట్టుకు చెందిన విద్యార్థి బసవయ్య ట్రిపుల్ లక్నో సీట్ లభించింది. అయితే కోర్సు ఫీజ్ సుమారు రూ.4 లక్షలు ఉంది. విద్యార్థి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో కోర్సు ఫీజు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బసవయ్య తల్లిందండ్రలకు ఏమీ చేయాలో అర్థం కాలేదు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చిన ఆ డబ్బులతోనే ఇప్పటివరకూ చదివించారు. పిల్లాడికి ఇంకా చదివించాలని వారికి కోరిన ఉన్న ఆర్థిక స్థోమత లేకపోవడంతో సతమతమైపోయారు. పరీక్షలో 930వ ర్యాంకు సాధించి, ట్రిపుల్ ఐటీ లక్నోలో మొదటి కౌన్సిలింగ్‌లోనే సీట్ లభించింది. కానీ ఆ కోర్సు మొత్తానికి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఫీజు చెల్లించాలని తెలియడంతో బసవయ్య ఆశలన్నీ ఆవిరై పోయాయి. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. విద్యార్థి బసవయ్య తన సమస్య గురించి నారా లోకేశ్‌కు ట్విటర్ (X) వేదికగా తెలియజేశారు. విద్యార్థి ట్వీట్ చేసిన గంటలోనే మంత్రి సానుకూలంగా స్పందించి భరోసా కల్పించారు. లోకేశ్ రీట్వీట్ చేస్తూ ఫీజు గురించి ఆలోచించకుండా చదువు మీద దృష్టి పెట్టాలని బసవయ్యకు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి నారా లోకేశ్- ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఆర్థిక సాయం