Supreme Court orders APSRTC to pay 9 crore: బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.
అసలేం జరిగిందంటే? లక్ష్మి అనే మహిళ 2009 జూన్ 13న ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
వాదోపవాదాలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. రూ.5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు దాకా వెళ్లగా దాదాపు రూ.9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
పార్క్‌లో ప్రమాదం- మృతుడి ఫ్యామిలీకి రూ. 2,600 కోట్ల పరిహారం