ETV Bharat / bharat

అమెరికాలోని కుమార్తెకు ఫుడ్ పార్సిల్ పంపిన మహిళ- బ్యాంక్​ అకౌంట్లో రూ.కోటిన్నర మాయం! - WOMAN LOSES RS ONE AND HALF CRORE

కుమార్తె కోసం ఫుడ్​ ఐటెమ్స్​ పార్సిల్ చేసిన మహిళ- బ్యాంక్​ అకౌంట్​లో నుంచి రూ.కోటిన్నర కాజేసిన సైబర్ మోసగాళ్లు- అసలు ఏం జరిగిందంటే?

Woman Loses Huge Money In Cyber Fraud
Woman Loses Huge Money In Cyber Fraud (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 5:50 PM IST

Woman Loses Huge Money In Cyber Fraud : రోజురోజుకూ సైబరాసురులు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు చోరీ చేస్తున్నారు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ ఇలాంటి సైబర్​ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ. కోటికి పైగా కోల్పోయింది.

ఇదీ జరిగింది
మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ 78ఏళ్ల మహిళ అమెరికాలో ఉంటున్న తన కుమార్తె కోసం కొన్ని ఆహార పదార్థాలతో పాటు మరి కొన్ని వస్తువులు పంపాలని నిర్ణయించుకుంది. అనంతరం ఓ కొరియర్‌ సర్వీసును సంప్రదించింది. ఆ కొరియర్‌ పంపిన తరువాతి రోజు అదే కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి వృద్ధురాలికి ఫోన్‌ చేశాడు. 'మీరు పంపించిన కొరియర్‌లో ఆహారంతో పాటు ఆధార్‌ కార్డు, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్‌ కార్డులు, 2000 డాలర్ల నగదు, ఇతర వస్తువులు ఉన్నాయి' అని చెప్పాడు. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ వృద్ధురాలిని నమ్మించేందుకు మరో ఇద్దరితో కలిసి ఉన్నతాధికారుల్లా నటించారు.

సైబర్​ మోసగాళ్లు వృద్ధురాలికి చేసిన వీడియో కాల్స్‌లో అధిరాల యూనిఫాంలో కనిపించి మరింత భయపెట్టారు. విచారణ పేరుతో పది రోజుల పాటు వృద్ధ మహిళతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె బ్యాంకు ఖాతా వివరాలు సేకరించారు. అనంతరం వారి ఖాతాల్లోకి మహిళ ఖాతాలో ఉన్న రూ.కోటిన్నరను బదిలీ చేయించుకున్నారు.

అయితే ఆ మహిళ జరిగిన విషయాన్నంతా తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి సైబర్​ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ విభాగం ప్రజలకు సూచించింది. అనుమానాస్పద కాల్స్‌, మెసేజ్‌లు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.