హైదరాబాద్​లో 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదల - GAME CHANGER TRAILER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 6:14 PM IST

Updated : Jan 2, 2025, 6:23 PM IST

LIVE : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ గురువారం రిలీజైంది. హైదరాబాద్​ కొండాపూర్ AMB సినిమాస్​లో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్​ ఈ ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్​గా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి మీరు ట్రైలర్ చూశారా? కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. అంజలీ, యస్​ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. గ్రాండియర్‌ విజువల్స్‌కు కేరాఫ్‌ అడ్రస్​గా పేరున్న డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో తన మార్క్ చూపించారు. ఎక్కడా రాజీ పడకుండా పాటలను గ్రాండ్ విజువల్స్​తో తెరకెక్కించారు. నాలుగు పాటలకు దాదాపు రూ.75 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.  'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం 
Last Updated : Jan 2, 2025, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.