LIVE: ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు - ప్రారంభించిన చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CBN IN WORLD TELUGU FEDERATION LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2025, 5:40 PM IST
|Updated : Jan 3, 2025, 6:44 PM IST
CM Chandrababu participated in World Telugu Federation conference: హైదరాబాద్లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ ఎల్ల, మురళీమోహన్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, కంభంపాటి తదితరులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు మహాసభలు జరగనున్నాయి. తెలుగు మహాసభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్లుండి హాజరుకానున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు 1992లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ మహాసభల్లో తెలుగు భాష ప్రాముఖ్యత, సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో రెండోసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు ఇందిరాదత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Jan 3, 2025, 6:44 PM IST