LIVE: యుఫోరియా మ్యూజికల్ నైట్పై నారా భువనేశ్వరి, థమన్ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - NTR TRUST EUPHORIA PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/640-480-23484558-thumbnail-16x9-ntr-trust-euphoria.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2025, 12:06 PM IST
NTR TRUST EUPHORIA PRESS MEET LIVE: తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ (EUPHORIA MUSICAL NIGHT) నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఇటీవల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 15న ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని నారా భువనేశ్వరి తెలిపిన విషయం తెలిసిందే. ప్రజా నాయకుడు చంద్రబాబు ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించారని నారా భువనేశ్వరి అన్నారు. తలసేమియా బారిన పడిన వారికి సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రక్త దానం సమాజానికి ఎంతో మంచి చేస్తుందని, ప్రతి రక్తపు చుక్క ప్రజల ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. తాము అడిగిన వెంటనే మ్యూజికల్ నైట్ చేసేందుకు తమన్ అంగీకరించారని భువనేశ్వరి తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నానని, బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం యుఫోరియా మ్యూజికల్ నైట్‌కి సంబంధించి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.