LIVE : లోక్సభలో బడ్జెట్ చర్చలు ప్రత్యక్ష ప్రసారం - PARLIAMENT BUDGET SESSION 2025 LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2025, 11:08 AM IST
Parliament Budget session 2025 Live : లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార, విపక్షాలు స్పందించాయి. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని బీజేపీ కొనియాడింది. మరోవైపు, బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ చికిత్స అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ గత బడ్జెట్ సమయంలో ప్రస్తావించిన అంశాలనే ఈసారి కూడా రాష్ట్రపతి వల్లెవేశారని వివరించారు. గతంలో ప్రభుత్వం చేసిన పనుల జాబితానే మళ్లీ మాట్లాడారని తెలిపారు. మేకిన్ ఇండియా మంచి ఆలోచనే కానీ, కార్యాచరణలో మోదీ విఫలమయ్యారనేది స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ విమర్శించారు. మన దేశం ఉత్పత్తులను నిర్వహించడంలో విఫలమై, ఆ రంగాన్ని చైనాకు అప్పగించిందని వివరించారు. ఇప్పుడు పూర్తిగా ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎంతో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా పనిచేస్తుందనీ, అయితే ఉత్పత్తి వ్యవస్థ నుంచి వచ్చే ప్రతి ఒక్క డేటా చైనాదేనని ఆందోళన వ్యక్తం చేశారు.