A Woman Donates 50 Lakhs To TTD: భారత్ సహా పలు దేశాల్లో విపత్తులు, స్పందన విభాగంలో సేవలందించిన ఓ మహిళ తన ఉద్యోగ జీవితంలో పొదుపు చేసిన సొమ్మును శ్రీవారికి కానుకగా సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమానికి దీనిని వినియోగించాలని ఆమె ఈ సందర్బంగా కోరారు. రేణిగుంటకు చెందిన సి.మోహన అనే మహిళ ఉద్యోగ రీత్యా అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో అభివృద్ధి - విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆమె ఎక్కడ పని చేస్తున్నా గోవిందుని నామస్మరణ మాత్రం మరిచిపోలేదు. ప్రత్యేకంగా పొదుపు చేస్తూ ఆ సొమ్మును శ్రీవారికి కానుకగా ఇవ్వాలని ఆమె సంకల్పించారు. ఈ మొత్తం రూ.50 లక్షల రూపాయలు కాగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి డీడీని అందజేశారు. మోహన ఇచ్చిన నగదు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుకు జమకానుంది.
పెద్ద మనసు చాటుకున్న సినీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims