LIVE : దిల్లీలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU PRESS MEET DELHI LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2025, 9:10 AM IST
|Updated : Feb 3, 2025, 9:51 AM IST
Chandrababu Press Meet in Delhi Live : దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయెల్ తరఫున ప్రచారంలో భాగంగా నిర్వహించిన తెలుగువారితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పదేళ్ల ఆప్ పాలనలో దిల్లీకి అన్ని రకాలుగా భ్రష్టు పట్టిందని చంద్రబాబు విమర్శించారు. వాయువుతోపాటు రాజకీయాలు కాలుష్యమయ్యాయని చెప్పారు. బీజేపీ పాలనతోనే ప్రజలకు ఆక్సిజన్ లభిస్తుందన్నారు. దిల్లీలో పాఠశాలల పునరుద్ధరణ, మొహల్లా క్లినిక్ వల్ల ప్రజలకు పెద్దగా ఒనగూరిందేమీ లేదని ఆక్షేపించారు. దిల్లీ యువత ఉద్యోగాలకు, ప్రజలు ఉత్తమ వైద్య సేవలకు దూరమయ్యారని దుయ్యబట్టారు. ప్యాలెస్‌లు కట్టుకొని విలాస జీవితాలు గడిపేవారిని కాదు, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన పదిన్నర గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి విజయవాడ బయల్దేరి రానున్నారు.
Last Updated : Feb 3, 2025, 9:51 AM IST