NTR District Nandigama Municipal Council Chairman Election : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం ఛైర్మన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఇద్దరు కౌన్సిలర్లు చనిపోవడంతో అవి ఖాళీగా ఉన్నాయి. 18 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌తో కలిపి మొత్తం 20 మందికి ఓటు హక్కు ఉంది. టీడీపీ జనసేనకు కలిపి 14 మంది కౌన్సిలర్లు ఉండటంతో వీరు నిర్ణయించిన వారే ఛైర్మన్ అయ్యే వీలుంది. హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు రోజే హిందూపురానికి చేరుకున్నారు. మున్సిపాలిటికీ 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
ఆ కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ల ఎన్నిక - తేదీ ప్రకటించిన ఎన్నికల సంఘం