Rachin Ravindra Injury : న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ తలకు గాయమైంది. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నించిన అతడు బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి అతడి తలకు బలంగా తగిలి రక్త స్రావం జరిగింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. ఎందుకంటే?
ఈ మ్యాచ్ పాకిస్థాన్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. ఈ స్టేడియాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటీవల రెనొవేషన్ చేసి, రెండు రోజుల కిందటే పునఃప్రారంభించారు. అలా పునఃప్రారంభమైన తర్వాత స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇలా జరగడంతో పీసీబీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాసిరకం లైట్ల కారణంగానే రచిన్‌కు బంతి సరిగ్గా కనిపించలేదని అన్నారు. అంతేకాకుండా క్వాలిటీ లేని ఫ్లడ్లైట్లతో స్టేడియాలను ఆధునికీకరించారని ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్ స్టేడియాల రెనొవేషన్‌లో నాణ్యత లోపించిందని, దీని వల్ల యువ ఆటగాడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అంటున్నారు. పాకిస్థాన్ స్టేడియాల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఐసీసీ ఎలా అనుమతించిందని కామెంట్లు పెడుతున్నారు. పీసీబీ పాకిస్థాన్ స్టేడియాల్లో ఫ్లడ్‌లైట్ల క్వాలిటీని పెంచాలని అడుగుతున్నారు. ఫ్లడ్‌లైట్ల నాణ్యత లోపం వల్లే రచిన్‌కు గాయమైందని, అతడు త్వరగా కోలుకోవాలని అతడు పోస్ట్ షేర్ చేశాడు. ప్లేయర్ల భద్రతను ఐసీసీ కట్టుబడి ఉండాలని మరో నెటిజన్ అన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
PCB should improve the Quality of light in the Ground.
— Shakeel Md (@Shakeel7217) February 8, 2025
Rachin Ravindra misjudges the ball under bad lights and takes a brutal hit near the eye.
Hope he Recover soon....।।। pic.twitter.com/nXXuwHI1fg
ఇది జరిగింది
ఈ మ్యాచ్ పాక్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ మూడో బంతిని పాకిస్థాన్ బ్యాటర్ కుష్దిల్ షా స్క్వేర్ లెగ్ దిశగా స్పీప్ షాట్ కొట్టాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్‌కు బంతి ఈజీ క్యాచ్‌గా వెళ్లింది. కానీ, బంతిని అంచనా వేయడంలో విఫలమైన రచిన్ క్యాచ్ పట్టుకోలేదు. దీంతో అది నేరుగా అతని నుదిటిపై బలంగా తాకి, రక్త స్రావం జరిగింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు పరిశీలించి అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన క్రికెట్ ఫ్యాన్స్ అతడు తొందరగా కామెంట్లు పెడుతున్నారు.
Get well soon, Rachin Ravindra. 🙏pic.twitter.com/QhJ82fxN4T
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 8, 2025
రచిన్ తలకు తీవ్ర గాయం- మైదానంలో కుప్పకూలిన యంగ్ బ్యాటర్
న్యూజిలాండ్ సిరీస్‌లో రచిన్ అజేయ శతకం - 12 ఏళ్లలో తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు