ETV Bharat / state

దిల్లీలో బీజేపీ గెలుపు - దేశ ప్రగతికి మలుపు : చంద్రబాబు - CHANDRABABU ON DELHI ELECTIONS 2025

chandrababu tour in delhi

Chandrababu Campaign Delhi Elections
Chandrababu Campaign Delhi Elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2025, 11:09 AM IST

Chandrababu on Delhi Elections : సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వివరించారు. ఎవరికి ఓట్లు వేస్తే డెవలప్​మెంట్ జరుగుతుందో ఆలోచించాలన్నారు. దిల్లీలో వాతావరణ కాలుష్యంతోపాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని చెప్పారు. అభివృద్ధికి దేశ రాజధాని ఆమడదూరంలో ఆగిపోయిందని సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. డెవలప్​మెంట్ కావాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. హస్తినలో కమలం గెలుపు దేశ ప్రగతికి మలుపని అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

భారత్‌ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని సీఎం తెలిపారు. 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతోందని అన్నారు. ఏఐ సాంకేతికతలో దేశం ప్రముఖ పాత్ర వహించనుందని పేర్కొన్నారు. గతంలో ఐటీపై ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​పై దృష్టి పెరిగిందన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగినట్లు తెలియజేశారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని ఆయన స్పష్టం చేశారు.

"ఇప్పుడు పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌, పార్టనర్‌షిప్‌ విధానమే. భారత్‌లో పెట్టుబడులకు చాలామంది ముందుకొస్తున్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన పెరుగుతోంది. వృద్ధిరేటు పెంచేలా ఈ బడ్జెట్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

Chandrababu Delhi Tour Updates : మరోవైపు సంపద దోచుకునేవాళ్లు కాదు పంచేవాళ్లు కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. విభజనతోనేకాదు గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఏపీ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. మన పరిపాలన బాగుంటే కేంద్రం చేయూత ఇస్తుందన్నారు. కేంద్రం ప్రభుత్వం చేయూత అందిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తుందని వివరించారు. అన్నిరంగాల్లో జరిగిన విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతూ అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'వికసిత్‌ భారత్ దార్శనికతకు ప్రతిబింబం' - నిర్మలమ్మ బడ్జెట్​పై చంద్రబాబు స్పందన

తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారో తెలియదు - సంపద సృష్టిస్తేనే ఆదాయం పెంపు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.