A Woman Embroidered 108 Lalitha SahasraNama On Silk Saree In Bapatla District: శ్రీశైలం భ్రమరాంబికాదేవిపై భక్తితో పట్టుచీరపై 108 లలితా సహస్ర నామాలు రాసి వాటిని ఎంబ్రాయిడరీ చేసి, బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ మహిళ తన భక్తిని చాటుకున్నారు. పట్టణంలోని పాపరాజుతోటకు చెందిన చుండూరి సరస్వతి భ్రమరాంబ సేవాసమితి తరఫున శ్రీశైలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అక్కడ వారు చేసే కార్యక్రమాలు చూసి తానూ అమ్మవారికి ఏదైనా వినూత్నంగా సమర్పించాలని అనుకున్నారు.
అందుకు ఆమెకు వచ్చిన ఎంబ్రాయిడరీతో పట్టుచీరపై లలిత సహస్రనామాలు రాసి అమ్మవారికి ఇవ్వాలని సంకల్పించుకున్నారు. తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, గత సంవత్సరం మార్చిలో ప్రారంభించి ఈ ఏడాది జనవరిలో పూర్తిచేశారు. నిత్యం ఆ తల్లికి పూజ చేసి నియమనిష్ఠలతో దీన్ని చేపట్టేవారు. మొదట పెన్సిల్‌తో చీరపై లలిత సహస్రనామాలు రాసి, తరువాత దానిని ఎంబ్రాయిడరీ చేసేవారు. ఈక్రమంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఈ చీరను మాఘమాసం పౌర్ణమి రోజు అమ్మవారికి సమర్పించనున్నారు.
లలితా దేవి అలంకారంలో వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్ల దర్శనం
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ - అమ్మవారి సేవలో సినీప్రముఖులు - Dasara Navaratri 2024