Tension in Guntur Muncipal Corporation Council Metting : గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాలక మండలి సమావేశం సందర్భంగా డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నగరపాలక సంస్థ ఆదాయ, వ్యయాలు చర్చించే సమయంలో అధికారులు తమాషాలు చేస్తున్నారా? అంటూ బాల వజ్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యంతరం చెప్పారు. తమాషాలు చేయడం ఏంటని డిప్యూటీ మేయర్ ను గట్టిగా నిలదీశారు. అయనప్పటికీ డిప్యూటీ మేయర్ తన వాదనను కొనసాగించడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు.
ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిషనర్: గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో డిప్యూటి మేయర్ బాలవజ్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అధికారుల్ని, ఉద్యోగుల్ని బెదిరించేలా డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఆరోపించారు. తప్పనిసరిగా దీనిపై చర్యలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎంతో ఓపికగా సమాధానం చెబుతున్నప్పటికీ అవమానించేలా బాలవజ్రబాబు మాట్లాడారని తన ఆవేదనను వెలిబుచ్చారు.డిప్యూటీ మేయర్ తీరు సరిగా లేదని అందుకే వెళ్లిపోతున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడికి చెప్పి బాయ్‌కాట్ చేశారు. అధికారులు సైతం కమిషనర్ వెంటే బయటకు నడిచారు. దీంతో సమావేశాన్ని అర గంట వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు
క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాల డిమాండ్: గుంటూరు డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు వెంటనే కమిషనర్ కు క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బాల వజ్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే డిప్యూటీ మేయర్ కమిషనర్ కు క్షమాపణలు చెప్పాలన్నారు. బాల వజ్రబాబు ప్రతిసారి ఉద్యోగులను ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
వివాదాస్పదంగా వైఎస్సార్సీపీ నేత వ్యాఖ్యలు: గుంటూరు డిప్యూటి మేయర్ బాలవజ్రబాబు అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన డిప్యూటి మేయర్ తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారుల్ని హెచ్చరించడం వివాదానికి దారితీసింది. దీంతో కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోవటంతో వివాదం అగ్గి మంటలా రాజుకుంది. టీడీపీ కార్పొరేటర్లు సైతం దీనిపై డిప్యూటీ మేయర్ తీరుని తప్పుబట్టారు. అందువల్ల సమావేశం అర్థాంతరంగా మధ్యలోనే ముగిసిపోయింది.
మేయర్ వర్సెస్ అధికారులు: డిప్యూటి మేయర్ వర్సెస్ అధికారులు అన్నట్లుగా గుంటూరు నగరపాలక సమావేశం నెలకొంది. కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రోషన్ అనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేసిన ప్రశ్నకు కమిషనర్ అందుకు బదులుగా సమాధానమిచ్చారు. అధికారి సమాధానంపై వైఎస్సార్సీపీ నేత, డిప్యూటి మేయర్ బాలవజ్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా? ఇలాంటి సమాధానాలు ఇవ్వటానికి సిగ్గులేదా అంటూ రెచ్చిపోయారు. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యంతరం చెప్పారు. తమాషాలు చేయడం ఏంటని డిప్యూటీ మేయర్ ను గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ డిప్యూటీ మేయర్ తన వాదనను కొనసాగించడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కడప మేయర్ సురేష్‌బాబుపై కేసు నమోదు
టీడీపీపై వ్యతిరేకత పెంచేలా మేయర్ కుట్ర: ఎమ్మెల్యే మాధవీరెడ్డి - MLA Madhavi Reddy Fire On MayorYSRCP MLA Mustafa: నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనేనా..! గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన