LIVE: విశాఖలో నేవీ డే విన్యాసాలు - ప్రత్యక్షప్రసారం - NAVY DAY CELEBRATIONS IN VISAKHA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2025, 4:04 PM IST
|Updated : Jan 4, 2025, 6:52 PM IST
Navy Day Celebrations in Visakha Live : ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం విశాఖలో జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ విశాఖ సాగర తీరంలో నౌకాదళ దినోత్సవ కొనసాగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సాగర తీరాన ఆర్కే బీచ్లో జరగుతున్న విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు తీరంలో యుద్ధ సన్నివేశాలను కళ్లకు కడుతున్నాయి. మరోపక్క సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకెళ్తూ సందడి చేస్తున్నాయి. మరోవైపు గగన తలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు ప్రజలను అబ్బురపరుస్తున్నాయి. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎలాంటి అపశ్రుతికి తావివ్వకుండా విన్యాసాలకు జాగ్రత్తలు తీసుకున్నారు. మెరైన్ పారా జంపర్లు, స్కై డైవర్లు, కమాండోల డ్రిల్స్ విన్యాసాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖలో నేవీ డే విన్యాసాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం
Last Updated : Jan 4, 2025, 6:52 PM IST