Minister Orders to Suspend Adoni Sub Registrar: ఆదోని సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆదోని సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు మిగతా ఉద్యోగులనూ సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే అధికారులను వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు.
కాగా కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో సబ్ రిజిస్ట్రార్‌తో పాటు, మరో ఐదుగురుపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌ను బాధితులు శనివారం గుర్తించారు. నకిలి డెత్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో 6.51 ఎకరాల భూమిను గోనెగొండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు.
బతికున్న అసలు యజమాని ఈశ్వరప్ప 2009లో చనిపోయినట్లు నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బాధితులు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఫలితం లేకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కోట్ల రూపాయల విలువ చేసే తమ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ హాజమియాతో పాటు, మరో ఐదుగురుపై కేసు నమోదు చేశామని డీఎస్పీ సోమన్న తెలిపారు. తాజాగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్, సబ్ రిజిస్ట్రార్‌తో పాటు మిగతా ఉద్యోగులనూ సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
బినామీ పేర్లతో దోపిడీ - బద్వేలు మున్సిపల్ వైస్‌ఛైర్మన్ అరెస్ట్