Jana Sena Party Plenary in Pithapuram : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) నిర్ణయించారు. ప్లీనరీ సన్నాహాలపై జనసేన పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది.
ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకం: 2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం పవన్ కల్యాణ్ జనసేన స్థాపించారని పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలిచారని మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను 3 రోజులపాటు నిర్వహించబోతున్నామని చెప్పారు. పార్టీ సిద్దాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ, ఇకపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొంటామని ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమిస్తామని నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు.
14వ తేదీ బహిరంగ సభ: 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్స కార్యక్రమం ఉంటుందని 14వ తేదీ బహిరంగ సభ జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూడు రోజులూ వివిధ అంశాలపై చేపట్టే చర్చాగోష్టులు ప్రజోపయోగంగా ఉండేలా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, లోకం మాధవి, అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ చైర్మన్ టీ. శివశంకర్, పార్టీ నేతలు బి.మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, కోన తాతారావు, కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు తెలిపారు.
తీరంలో 'ఆలివ్ రిడ్లీ' కంట తడి - డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
'గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు' - అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్