ముఖ్యమంత్రి జగన్​కు ముగ్గురు ముద్దుబిడ్డలు : ఆనం వెంకటరమణారెడ్డి - షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 2:01 PM IST

TDP Leader Anam Venkata Ramana Reddy Fire on CM Jagan : సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి పీఎల్‌ఆర్ కనస్ట్రక్షన్స్‌, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ (Shirdi Sai Electricals, రాఘవ కనస్ట్రక్షన్స్‌ ముద్దు బిడ్డలు లాంటివని నెల్లూరు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఈ మూడు కనస్ట్రక్షన్స్‌కు తప్ప సాధారణ గుత్తేదారులకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని ఆరోపించారు. అందుకే ఆ మూడు కంపెనీలు జగన్‌కు ముద్దు బిడ్డలు లాంటివని అన్నారు. న్యాయంగా, ధర్మంగా పని చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా తన అనుయాయులకే చెల్లింపులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Contractors Pending Bills in AP : పనులు చేసిన అధికార పార్టీ గుత్తేదారులకు కూడా బిల్లులు ఇవ్వడం లేదుని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. టెండర్ వేయాలంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలైన గుత్తేదారులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ కార్యకర్తలకు వెంటనే బిల్లులు చెల్లించాలని, బిల్లులు చెల్లించాకే జగన్ సిద్ధం సభలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.