thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 3:43 PM IST

Updated : Feb 29, 2024, 4:48 PM IST

ETV Bharat / Videos

LIVE : నదుల అనుసంధానంపై టాస్క్​ఫోర్స్​ ఛైర్మన్​ శ్రీరామ్​ మీడియా సమావేశం

Task Force Chairman Shri Ram Live : నదుల అనుసంధానంపై టాస్క్​ఫోర్స్​ ఛైర్మన్​ శ్రీరామ్​ మీడియా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్రం అడిగిన వివరాలు అధికారులు ఇవ్వలేదని తెలిపారు. ఎన్​డీఎస్​ఏకు సమాచారం ఇవ్వాలని చట్టం కూడా ఉందని టాస్క్​ఫోర్స్​ ఛైర్మన్​ శ్రీరామ్​ చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం కూడా మేడిగడ్డ వివరాలు ఇవ్వట్లేదని అన్నారు. నాలుగు నెలలు తర్వాత రాహుల్​ బొజ్జా ఎన్​డీఎస్​ఏకు లేఖ రాశారని వివరించారు. ఇప్పటికైనా ఎన్​డీఎస్​ఏ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రం సమాచారం ఇస్తేనే ఎన్​డీఎస్​ఏ విచారణ చేయగలుగుతుందని తెలిపారు. మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్​ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సిందని వివరించారు. జియో లాజికల్​ సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పుని అన్నారు. థర్డ్​ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లిషన్​ రిపోర్టులు ఇవ్వాలన్నారు. మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లీషన్​ రిపోర్టు ఇచ్చారని వివరణ ఇచ్చారు.  
Last Updated : Feb 29, 2024, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.