రాహుల్, అఖిలేశ్ సభలో 'తొక్కిసలాట'! ప్రసంగించకుండానే వెళ్లిపోయిన నేతలు - Stampede In Rahul Akhilesh Meeting - STAMPEDE IN RAHUL AKHILESH MEETING
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-05-2024/640-480-21507701-thumbnail-16x9-stampede-in-rahul-akhilesh-meeting.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : May 19, 2024, 6:06 PM IST
Stampede Like Situation In Rahul Akhilesh Meeting : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభ ప్రాంగణంలో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను వీరంగం సృష్టించారు. అడ్డు వచ్చిన పోలీసులను సైతం పక్కకు నెట్టి, అగ్ర నేతలు ఉన్న పోడియం వైపు పరుగులు పెట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
రమణ్ సింగ్‌ను ప్రయాగ్‌రాజ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపింది ఇండియా కూటమి. రమణ్ సింగ్ కోసం ప్రచారం చేసేందుకు ఆదివారం రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. హెలికాప్టర్లో బహిరంగ సభ ప్రాంతానికి వచ్చారు. అనంతరం పోడియం పైకి ఎక్కి ప్రసంగం మొదలు పెట్టారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మద్దతుదారులు భద్రతా వలయాన్ని ఛేదించారు. బారికేడ్లను తోసుకుంటూ పోడియం వైపు దూసుకొచ్చారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం పక్కకు నెట్టేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ తొక్కసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వేదికపై కూర్చున్న అఖిలేశ్ యాదవ్ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా మద్దతుదారులు వినిపించుకోలేదు. రాహుల్ మాట కూడా వినలేదు. దీంతో పూర్తిగా ప్రసంగించకుండానే ఇరువురు నేతలు వెనుదిరిగారు.
అయితే కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ మతిపోయిందని, అందుకే కుట్రలో భాగంగా సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని స్థానిక నేతలు ఆరోపించారు.