కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు - 21వరుసలతో పెద్దపట్నం ఆవిష్కరణ - Janmashtami celebration komuravelli - JANMASHTAMI CELEBRATION KOMURAVELLI
🎬 Watch Now: Feature Video


Published : Aug 26, 2024, 10:49 PM IST
Janmashtami celebration In komuravelli Mallanna Temple : గోకులాష్టమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జానపద తరహాలో శ్రీకృష్ణ, గొల్లభామ వేషధారణలతో ఆలయ ప్రాంగణంలో యాదవ పూజారులు ఉట్టిని కొట్టారు. అనంతరం ఉత్సవమూర్తులకు పూజలు చేసి పురవీధుల్లో భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఊరేగించారు. అనంతరం తోట బావి వద్ద పెద్ద పట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ యాదవ పూజరులచే ఆలయ ప్రాంగణం గంగరేగు చెట్టు వద్ద పంచ వర్ణాలతో 21వరుసలతో పెద్దపట్నం నిర్వహించారు.
ఆలయ వర్గాలు ముందుగా గొంగడిలో బియ్యాన్ని పోసి సుంకు, మైలు పోలు తీసారు. పసుపు, కుంకుమ, తెల్ల, పచ్చ పిండి, సున్నేరులతో 21 వరుసలతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నంపై ప్రదక్షిణలు చేసి స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ శర్మ, ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.