19న విచారణకు రండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు తుది నోటీసులు
🎬 Watch Now: Feature Video
Speaker Tammineni Final Notice to YSRCP Rebel MLAs: వైఎస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణ జరుగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని తమ్మినేని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకపతే ఇప్పటి వరకు జరిగిన విచారణ ఆధారంగా ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. తుది విచారణకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై ఎమ్మెల్యేలు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. రెబెల్స్‌పై అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీ నేతలు మరో పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి బయటకొచ్చిన నలుగురు నేతలు టీడీపీకి మద్దతు తెలపడంతో వీరిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇదే రూట్లో టీడీపీ కూడా గతంలో తమ పార్టీ నుంచి గెలిచి వైఎస్సార్సీపీలో చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.