ETV Bharat / state

'ఫైన్ చెల్లించకుంటే వాహనం జప్తు చేయండి - వారిని అస్సలు ఉపేక్షించవద్దు' - HIGH COURT ON TRAFFIC VIOLATIONS

రహదారులపై ముమ్మర తనఖీలు చేసి అక్కడికక్కడే జరిమానాలు విధించాలన్న హైకోర్టు - హెల్మెట్‌ ధరించని వారిని ఉపేక్షించవద్దని వ్యాఖ్య

High Court On Traffic Violations
High Court On Traffic Violations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 7:10 AM IST

High Court On Traffic Violations: మోటారు వాహనాల చట్ట నిబంధనలను అమలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్​పై హైకోర్టు విచారణ జరిపింది. రహదారులపై ముమ్మర తనఖీలు చేసి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధమైన నేరగాళ్లు సైతం ఆ పనిని విరమించడమో లేదా వాయిదా వేయడమో చేస్తారని తెలిపింది. విచారణకు ఐజీ రవికృష్ణ నేరుగా కోర్టుకు హాజరయ్యారు. నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

జరిమానా 90 రోజుల్లో చెల్లించకుంటే: మోటారు వాహన చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. సీసీ కెమేరాలపై ఆధారపడి చలానాలు విధించే విధానాన్ని తగ్గించాలంది. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్‌ ధరించేలా చూడాలంది. జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయవచ్చనే నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.

నిర్థిష్ట సమయంలో చెలానాలను చెల్లించని వారి వాహనాలను సెక్షన్‌ 167 ప్రకారం సీజ్‌ చేయాలని, సెక్షన్‌ 206 ప్రకారం లైసెన్స్‌ రద్దు చేయాలని తేల్చిచెప్పింది. హెల్మెట్‌ ధరించని వారిని ఉపేక్షించవద్దని పేర్కొంది. హెల్మెట్‌ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్‌ నుంచి మూడు నెలల్లో 667 మంది కన్నుమూశారని, ఈ సంఖ్య ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. హెల్మెట్‌ను తప్పనిసరి చేయాలని ఈ ఏడాది జూన్‌లో తామిచ్చిన ఆదేశాలను అమలు చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికాదని పేర్కొంది.

వాహనదారులకు క్రమశిక్షణ లేదు: విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదంది. అనవసరంగా హారన్‌ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని, నగరంలో ఎక్కడా నో హారన్‌ బోర్డులు కనిపించడం లేదంది. ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతూ, విపరీతంగా హారన్లు మోగిస్తున్నారని తెలిపింది. అలాంటి వారిని పోలీసులు ఆపి తనఖీలు చేస్తున్న సందర్భం తాము ఒక్కటీ గమనించలేదంది.

ఈ మరణాలకు ఎవ‌రిది బాధ్యత? - పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

నేనూ ఓసారి జరిమానా చెల్లించా: పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వహించడం లేదుకాబట్టే, వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడింది. స్పీడ్‌ గన్‌లు సరిపడినన్ని ఏర్పాటు చేయలేదంది. దిల్లీ, చండీఘడ్‌లలో పోలీసులు తనిఖీలు చేస్తూ అప్పటికప్పుడే ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నారని గుర్తుచేసింది. వాహనం నడిపేటప్పుడు హైబీమ్‌ లైట్‌ వినియోగించినా జరిమానా విధిస్తారని తెలిపింది. తనకు ఈ విషయంలో ఓసారి జరిమానా విధించారని, అప్పటికప్పుడు సొమ్ము చెల్లించానని హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని రవాణా చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం ధర్మాసనం పేర్కొంది.

99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని తెలిపింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్‌ ధారణ తప్పనిసరి చేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, జిల్లాల వారీగా ఎంత మంది బృందాల్ని ఏర్పాటు చేశారో చెప్పాలని, ప్రభుత్వం తీసుకోబోయే ప్రతిపాదనల వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందు ఉంచాలని, డీజీపీ కార్యాలయం నుంచి కోర్టు విచారణకు హాజరైన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆకే రవికృష్ణ(లీగల్‌)ను ఆదేశించింది. పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.

'చలానాలు వేసి చేతులు దులిపేసుకుంటే కుదరదు - మూడు నెలల్లో 667 మరణాలా?'

విచారణ 3 వారాలకు వాయిదా: ప్రజలను ఛైతన్యవంతుల్ని చేసేందుకు సదస్సుల నిర్వహణను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలంది. అందుకోసం పత్రికలు, టీవీలు, ఎఫ్‌ఎం రేడియోలు, ప్రకటన బోర్డులు, సినిమా హాళ్లలో ప్రకటనలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తీసుకోబోయే చర్యల వివరాలను వివరిస్తూ అఫిడవిట్‌ వేయడానికి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీలమపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేస్తే రెండు నెలల్లో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని అందుకు తమది హామీ అని వ్యాఖ్యానించింది.

మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుని భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. హెల్మెట్‌ ధరించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ట్రాఫిక్‌ ఐజీని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ(లీగల్‌) హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఐజీతో మాట్లాడింది.

చట్ట నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. హెల్మెట్‌ ధరించని కారణంగా రాష్ట్రంలో మూడు నెలల్లో 667 మరణాలు చిన్న విషయం కాదంది. ఐజీ బదులిస్తూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు. తనఖీలు చేసి జరిమానాలు విధిస్తామన్నారు. అవగాహన సదస్సులను ఇప్పటికే నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. జరిమానా వసూళ్లలో పురోగతి ఉందన్నారు. అఫిడవిట్‌ వేయడానికి సమయం కావాలని కోరారు. దీంతో విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

హెల్మెట్​ పెట్టుకుంటే జుట్టు రాలుతోందని దిగులు పడుతున్నారా? - అయితే దీన్ని ట్రై చేయండి - Shoulder Helmet Designed

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.