నర్సీపట్నంలో 63వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ- ఎవరిదో తెలియదంటున్న అధికారులు - Ayyanna Patrudu Visit sand depo

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 12:59 PM IST

Speaker Ayyanna Patrudu Comments on Sand Mafia : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గప్పాడ వద్ద డిపోలో ఉన్న 63 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలకు లెక్కలు లేకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఇసుక డిపోను పరిశీలించిన సభాపతి అక్రమ ఇసుక నిల్వపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌తో అయ్యన్న ఫోన్‌లో మాట్లాడి ఇసుక అక్రమ నిల్వ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పేదలకు సరఫరా చేయాల్సిన ఇసుకను ఇక్కడకు ఎవరు తెచ్చి నిల్వ చేశారు అనే విషయాలను నిగ్గుతేల్చాలని ఆదేశించారు. ఈ అక్రమంలో భాగమైమ ప్రతీ ఒక్కరిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు. వందల కోట్లు దోచుకున్న ఇసుక మాఫియాను బయటపెట్టాలన్నారు. దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుందని పేర్కొన్నారు. విచారణ జరిపి కేసు నమోదు చేశాక ఇసుక బయటకు తీయాలని సూచించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.