కండక్టర్ డ్యూటీలో తమ్ముడు - బస్సు ఆపి మరీ రాఖీ కట్టిన సోదరి - Sister Tied Rakhi To The Conductor - SISTER TIED RAKHI TO THE CONDUCTOR
🎬 Watch Now: Feature Video
Published : Aug 19, 2024, 7:50 PM IST
Sister Ties Rakhi To Brother Duty As Rtc Conductor : తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునేదే రాఖీ పండుగ. సోదరులు అండగా ఉంటాలంటూ సోదరీమణులు రాఖీలు కడితే, రక్షగా నిలుస్తానంటూ సోదరులు మాటిస్తారు. అలాంటి ఈ పర్వదినం గొప్పతనాన్ని చాటిన అపురూప సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కండక్టర్‌గా విధుల్లో ఉన్న తమ్ముడికి బస్సులోనే అక్క రాఖీ కట్టింది.
వివరాల్లోకి వెళితే పోకల కృష్ణమూర్తి భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పండక్కి సెలవు దొరక్కపోవడంతో సోమవారం ఆయన డ్యూటీలోనే ఉన్నారు. తమ్ముడిపై ప్రేమతో రాఖీ కట్టాలనుకున్న ఆయన సోదరి ముక్క సరస్వతి శాయంపేట మండలం పెద్దకోడెపాక క్రాస్ వద్ద వేచి చూశారు. హనుమకొండ నుంచి వస్తున్న బస్సును ఆపి, డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టారు. ఎంతో ఆప్యాయంగా మిఠాయిలు తినిపించుకున్నారు. వారిద్దరి ఆప్యాయతను చూసిన ప్రయాణికులు ఆనందంతో అభినందనలు తెలిపారు.