రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం - కేవలం నెల రోజుల్లో ఎంతంటే? - Income of Simhadri Appanna Hundi
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2024, 7:53 PM IST
|Updated : May 28, 2024, 8:12 PM IST
Simhadri Appanna Hundi Income of May Month : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. నెల రోజుల్లోనే రూ.2 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. స్వామి దర్శనానికి భక్తులు నెల రోజులపాటు భారీగా తరలివచ్చారు. దీంతో 28 రోజులకుగాను 2 కోట్ల 60 లక్షల 71 వేల రూపాయలు వచ్చిన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో 116 గ్రాముల బంగారం, 20 కేజీల వెండిని భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో రానున్న రోజుల్లో భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీంతో దేవస్థానానికి మరింతగా ఆదాయం వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వామివారికి రెండో విడత చందనం సమర్పణ చేశారు. 125 కేజీల చందనాన్ని మూడు రోజులపాటు అరగదీసి స్వామివారికి సమర్పించారు. ఈ వైభవాన్ని చూడటం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో సింహాచలం సింహాద్రి అప్పన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.