అయోధ్య రామాలయానికి కానుకగా 1.75 కిలోల వెండి చీపురు - అయోధ్య రాముడికి వెండి చీపురు
🎬 Watch Now: Feature Video
Published : Jan 28, 2024, 1:42 PM IST
Silver Broom Gift For Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరానికి భక్తులు ఇంకా విరాళాలు, కానుకలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా అఖిల భారతీయ మాంగ్ సమాజ్‌కు చెందిన శ్రీరామ భక్తులు బాలక్ రామ్ కోసం ఒక చీపురును కానుకగా ఇచ్చారు. అది కూడా 1.751 కిలోల వెండిని ఉపయోగించి తయారు చేసినది. ఈ వెండి చీపురును అఖిల భారత మాంగ్ సమాజ్ భక్తలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందించారు. బాలక్ రామ్ గర్భగుడిని ఈ వెండి చీపురుతో శుభ్రం చేయాలని కోరారు.
గుజరాత్ నుంచి 108 అడుగుల అగరబత్తి
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 108 అడుగుల పొడవాటి అగరుబత్తిని బాలరాముడికి కానుకగా ఇచ్చారు. దీనిని గుజరాత్‌లోని వడోదరలో తయారు చేశారు. పంచద్రవ్యాలతో, హవన పదార్థాలతో తయారుచేసిన ఈ మహా అగరుబత్తి బరువు 3 వేల 500 కిలోలు ఉంటుంది. దీనిని తయారు చేయడానికి 6 నెలలు పట్టింది. దీనికి 5 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.