సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనా? : షబ్బీర్ అలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

Shabbir Ali visited Kamareddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారునిగా నియమాకం అయిన తర్వాత కామారెడ్డి జిల్లాలో తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దేశంలో ఉన్న మైనార్టీలకు బడ్జెట్​లో భారీగా నిధులు కుదించారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలపై చిన్న చూపుతో స్కాలర్​షిప్ తగ్గించారని అలీ పేర్కొన్నారు. మోదీ సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనా అని షబ్బీర్​ ప్రశ్నించారు.  

Shabbir Ali Fires On KTR : కేంద్ర బడ్జెట్ నిరాశకు గురి చేసిందని షబ్బీర్​ అలీ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు రాదని, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం రాష్టాన్ని లూటీ చేసిందని, రెండు నెలలు కాకముందే తమపై విమర్శలు చేయడం తగదని షబ్బీర్​ అలీ మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, త్వరలో పోలీస్ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్ వేస్తామని అలీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.