'కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలి - గవర్నమెంట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి' - SFI Protest at Intermediate Board Office - SFI PROTEST AT INTERMEDIATE BOARD OFFICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 1:46 PM IST

SFI Protest at Intermediate Board Office : కార్పొరేట్​ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయడం సహా ప్రభుత్వ ఇంటర్​ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లోని ఇంటర్మీడియట్​ బోర్డు కార్యాలయం ఎదుట ఎస్​ఎఫ్​ఐ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్​ బోర్డు ముందు బైఠాయించినా అధికారులు స్పందించకపోవటంతో పలువురు ఎస్​ఎఫ్​ఐ శ్రేణులు గేటు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. 

ఆందోళనల నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మారినా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. అనుమతులు లేని కళాశాలలను వెంటనే మూసివేయాలని డిమాండ్​ చేశారు. రీ-వెరిఫికేషన్​ పేర్లతో కొన్ని కార్పొరేట్​ కళాశాలలు రూ.లక్షల ఫీజులను వసూలు చేస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్​ఐ శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.