thumbnail

పూల పండుగ కోసం అమెరికాలో ఒక్కటైన తెలుగు మహిళలు

By ETV Bharat Telangana Team

Published : 1 hours ago

Bathukamma Celebrations In America : అంతర్జాతీయ బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అమెరికా వర్జీనియా రాష్ట్రం రిచ్​మండ్ నగరంలో గ్రేటర్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 700 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి సంప్రదాయ వస్త్రాలు ధరించిన మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ చుట్టు తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుక సాంప్రదాయబద్ధంగా ఉత్సాహభరితంగా సాగింది. బతకుమ్మ పాటలు పాడుకుంటూ సంబరంగా గడిపారు. 

జన్మభూమికి దూరంగా ఉంటున్న వీరికి ఈ వేడుక ఆనందం, ఐక్యత తీసుకొచ్చినట్లైంది. బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలకు అసోసియేషన్ వారు బహుమతులు అందించారు. ప్రతి సంవత్సరం దసరా, బతుకమ్మ సంబరాలు అమెరికాలో ఘనంగా నిర్వహించుకోవడం తమకు అనవాయితీగా వస్తుందని గ్రేటర్ రిచ్​మండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ కందుల తెలిపారు. దసరా, దీపావళి వేడుకలను కూడా ఘనంగా జరుపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.