పంచాయతీ నిధులు నిర్వీర్యం చేసిన సీఎం జగన్- ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధం - కలెక్టరేట్ వద్ద సర్పంచ్‌ల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 4:15 PM IST
Sarpanches Protest at Collectorate in Srikakulam District : పంచాయతీలకు నిధులకు ఇవ్వకుండా వాటి నిర్వీర్యం చేసిన సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉమ్మడి జిల్లా సర్పంచ్‌లు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సర్పంచ్‌ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్‌లు కలెక్టరేటు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పోలీసులు కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుందని బాబు రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌ల 16 న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలు అందరూ సీఎం జగన్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.