LIVE : ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబురాలు - BATHUKAMMA CELEBRATIONS AT TANKBUND
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2024, 5:52 PM IST
|Updated : Oct 10, 2024, 8:09 PM IST
Saddula Bathukamma Celebrations At Tank Bund Live : రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. అమరవీరుల స్మారకం నుంచి చిల్ట్రన్స్ పార్క్ వరకూ బతుకమ్మ ఊరేగింపు జరిగింది. సద్దుల వేడుకల సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు అనంతరం లేజర్ షో, క్రాకర్ షో జరిగింది. సుమారు 10వేల మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. నగరంలో సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్‌పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు. సుమారు 800 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Oct 10, 2024, 8:09 PM IST