పిస్తా హౌస్​లో రౌడీ షీటర్ల వీరంగం - కస్టమర్లపై పిడిగుద్దుల వర్షం, అడ్డుకోబోయిన సిబ్బందిపైనా - Rowdy gang halchal Pista House

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 5:13 PM IST

Rowdy sheeters Attack Youth in Rajendra Nagar : హైదరాబాద్​ నగర శివారు ప్రాంతంలో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ ఉప్పర్​పల్లి పిస్తా హౌజ్​ హోటల్​లో 17 మంది గ్యాంగ్​ ప్రవేశించి భయానక వాతావరణాన్ని సృష్టించారు. అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. హోటల్​లో భోజనం చేస్తున్న యువకులపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీంతో వారి మధ్య కాస్త ఘర్షణ జరిగింది. 

ఈ సంఘటనతో హోటల్​లో ఉన్న వారు భయంతో బయటకు పరగులు తీశారు. ఆ రౌడీ షీటర్లకు భయపడి యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్కింగ్​లో ఉన్న ద్విచక్ర వాహనాలను సైతం రౌడీ షీటర్లు ధ్వంసం చేస్తూ, అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నిందితుల దాడి దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. హోటల్​ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.