ఎలుకా ఎలుకా ఉచ్ ఎక్కడికెళ్లావోచ్ - చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్నానోచ్ - RAT IN CHUTNEY AT JNTU COLLEGE - RAT IN CHUTNEY AT JNTU COLLEGE
🎬 Watch Now: Feature Video
Published : Jul 9, 2024, 12:49 PM IST
Rat In Chutney At JNTU Campus Sangareddy : ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఉంది. బాలుర హాస్టల్ క్యాంటీన్‌లోని చట్నీ పాత్రకు మూత పెట్టకపోవడంతో గిన్నెలో ఎలుక పడిపోయింది.
నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులకు దీనిని పంపించారు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనపై ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని ఆయన స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో మాత్రమే ఎలుక కనిపించిందని పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆయన ఆరోపించారు.