విజయవాడ నూతన సీపీగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ- డీసీపీలతో సమావేశం - Vijayawada new Commissioner

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 8:17 PM IST

Ramakrishna Took Charge as Vijayawada New Commissioner :విజయవాడ పోలీస్ కమిషనర్​గా పీహెచ్​డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈరోజు ఉదయం 9.30 గంటల సమయంలో ఆయన సీపీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. గతంలో సీపీగా ఉన్న కాంతిరానాను బదిలీ చేసి ఆయన స్థానంలో పీహెచ్​డి రామకృష్ణను నూతన సీపీగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిన్న(బుధవారం) ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11గంటల లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈసీ ఆదేశాల మేరకు రామకృష్ణ నూతన సీపీగా వచ్చారు. కమిషనరేట్ పరిధిలోని డీసీపీలతో సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతలు, రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. జిల్లాకు సంబంధించి అన్ని విషయాలను ఆయన అడిగారని పోలీసు వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం సీపీగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ ముందు ఎన్నికల నిర్వహణ, సీఎం జగన్ పై రాయి దాడి కేసు విచారణ సవాళ్లుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈకేసు దర్యాప్తు అంశంపై పలు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే కేసు విచారణ కూడా పలు అనుమానాలను అధికార ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.  రామకృష్ణకు గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన అనుభవం ఉంది. చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారని పోలీసు శాఖలో పేరుంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.