స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : ప్రొఫెసర్ కోదండరాం - Kodandaram fires on Smita Sabharwal - KODANDARAM FIRES ON SMITA SABHARWAL
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 8:41 PM IST
Kodandaram Fires On Smita Sabharwal : దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం సరైంది కాదని హితవు పలికారు.
వైకల్యం కలిగిన వాళ్లు సకలాంగుల కంటే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని కొదండరాం గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదన్నారు. స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్ధించుకోవడం శోచనీయం అన్నారు. నాగరిక సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడాలని సూచించారు. వైకల్యాన్ని శాపంగా చూసే ఒక సంప్రదాయక ఆలోచన సరళిని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరుతున్నాను. కాగా ఇటీవల ఎక్స్ వేదికగా స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్‌పై తీవ్ర దుమారం రేగింది.