LIVE : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం - PM narendra Modi road show
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-03-2024/640-480-20990904-thumbnail-16x9-modi2.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 15, 2024, 6:23 PM IST
|Updated : Mar 15, 2024, 7:01 PM IST
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరు పెంచింది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీ, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్కాజిగిరికి చేరుకుని రోడ్ షోలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు ఈ రోడ్‌షో సాగనుంది. ఈ రోడ్ షో అనంతరం మోదీ రాజ్‌భవన్ చేరుకుంటారు.శనివారం నాగర్‌కర్నూల్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ లోక్‌సభ స్థానాలు లక్ష్యంగా ఈ సభ జరగనుంది. తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు ప్రధాని వివరించనున్నారు. దేశంలో మూడోసారి బీజేపీ సర్కార్ రావాల్సిన ఆవశ్యకతను వివరించి మరోసారి ఆశీర్వదించమని కోరనున్నారు. అలాగే ఈ నెల 18న మోదీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా దానికి రూపకల్పన చేశారు.
Last Updated : Mar 15, 2024, 7:01 PM IST