LIVE : ప్రధాని మోదీ 'మన్​ కీ బాత్​' కార్యక్రమం - pm modi mann ki baat live - PM MODI MANN KI BAAT LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 11:06 AM IST

Updated : Aug 25, 2024, 11:31 AM IST

PM Modi Mann ki Baat Live Today : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్​ కీ బాత్​. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం మన్​ కీ బాత్​. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకున్నారు. 2014 అక్టోబరు 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మన్​ కీ బాత్​లో ప్రధాని మోదీ పారిస్​ ఒలింపిక్స్​లో భారత్​ గెలుచుకున్న పతకాల గురించి, ప్రదర్శన గురించి కొనియాడారు. అలాగే పారాఒలింపిక్స్​లో పాల్గొనబోయే భారత జట్టుకు శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల గురించి ప్రజలతో తన అనుభవాలను పంచుకున్నారు. అలాగే నేపాల్​లో ఉత్తరప్రదేశ్​ బస్సులో 41 మంది మరణించడంపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.
Last Updated : Aug 25, 2024, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.