'హెచ్‌సీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది - కేసుల దర్యాప్తును వేగవంతం చేయండి' - Hyderabad Cricket Association
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2024, 11:34 AM IST
Hyderabad Cricket Association news: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వై. లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీనిపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. టీసీఏతో కలిసి రూరల్ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ విషయాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. జస్టిస్ నాగేశ్వర రావు కమిటీ 300కి పైగా ఉన్న అక్రమ నగదు బదిలీల్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైనట్లు గుర్తించిందని అన్నారు. హెచ్‌సీఏ జనరల్ మీటింగ్ ఏర్పాటు చేసి అకౌంట్స్ పాక్షికంగా ఆపివేసినట్లు సుప్రీంకోర్టుకు, బీసీసీఐకి, హెచ్‌సీఏ నివేదించిందన్నారు. గ్రామాల్లో క్రీడాకారులకు గుర్తింపును ఇవ్వాలని కోరారు. తాము ఇటీవల ఫైల్ చేసిన కేసులను స్వీకరించి నిందితులను సస్పెండ్ చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి డిమాండ్ చేశారు.