రాజీవ్ గాంధీ వర్ధంతి - న్యూయార్క్​లోని టైమ్స్​ స్క్వేర్​ వద్ద పొన్నం ప్రభాకర్​ నివాళులు - Ponnam Prabhakar Video Rajiv Gandi - PONNAM PRABHAKAR VIDEO RAJIV GANDI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 12:26 PM IST

Updated : May 21, 2024, 1:28 PM IST

Ponnam Prabhakar paid tribute to Rajiv Gandhi : రాజీవ్ గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతిత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్​లో టైమ్స్ స్క్వేర్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. దిల్లీ నుంచి గల్లీ వరకు నిధులను తీసుకురావటానికి కార్యాచరణను తీసుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్‌ అని కొనియాడారు.

Ponnam Video on Rajiv Gandi in America : గ్రామాల్లో స్వరాజ్యం తీసుకురావటానికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని పొన్నం ప్రభాకర్​ అన్నారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అనేక అసాంఘిక శక్తులు, దేశ విచ్చిన్నానికి మతం, కులం, ప్రాంతం పేరుతో ఇబ్బందులు కలిగించే పరిస్థితుల్లో ఆయన దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడటానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని పేర్కొన్నారు.

Last Updated : May 21, 2024, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.