రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం : పొన్నం ప్రభాకర్ - Ponnam Prabhakar Sirisilla news
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 3:53 PM IST
Ponnam Prabhakar In Rajanna Sirisilla : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖాళీగా ఉన్నా, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి సభలో ఆయన ప్రసంగించారు. రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ విగ్రహాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మధ్యమానేరు ప్రాజెక్టు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు.
Ponnam Comments On BRS : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, గతంలో ప్రజా సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 6 వేల బస్సులు కేటాయించటంతో గ్రామాల్లో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడిందన్నారు. ఈ నెల 25 వరకు బస్సులు అందుబాటులో ఉండవని తెలిపారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పొన్నం అన్నారు.