బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు - EC Officials Inspected to KCR Bus - EC OFFICIALS INSPECTED TO KCR BUS
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 4:24 PM IST
Police Checked to KCR Bus : ఎన్నికల వేళ రాష్ట్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద పలువురు నేతల వాహనాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సును పోలీసులు ఇవాళ తనిఖీ చేశారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పర్యటనలో భాగంగా ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్లారు.
ఈ క్రమంలోనే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవత్ తండాలో రైతులను కలిసి తిరిగి వెళ్తుండగా, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని కొడకండ్ల మండలం మొండ్రాయి ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారు. కేసీఆర్ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీస్ అధికారులు చెక్ చేశారు. అనంతరం బస్సులో ఏం లేకపోవడంతో వాహనాలను పంపించేశారు. తనిఖీ అనంతరం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించేందుకు వెళ్లారు.