సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ - PM Modi Telangana Tour
🎬 Watch Now: Feature Video
Published : Mar 5, 2024, 11:47 AM IST
PM Modi Visit Secunderabad Ujjaini Mahankali Temple : రాష్ట్రంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి రాజ్‌భవన్‌లో బసచేసిన మోదీ, ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆలయ మర్యాదలతో ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఉజ్జయిని అమ్మవారి శేష వస్త్రంతో పాటు చిత్రపటాన్ని ప్రధానికి అందించారు.
PM Modi Attends Sangareddy Public Meeting : పూజల అనంతరం మహంకాళి ఆలయం నుంచి సంగారెడ్డి జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయల్దేరారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. మోదీ పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.