చుడీదార్ ఆర్టర్ చేస్తే సగం జీన్స్ డెలివరీ - అవాక్కైన కస్టమర్ - ఆ తర్వాత ఏమైందంటే? - online order fraud in nizamabad - ONLINE ORDER FRAUD IN NIZAMABAD
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 1:46 PM IST
Online Order Scam in Nizamabad : ఆన్లైన్లో చుడీదార్ ఆర్డర్ పెడితే విచిత్రంగా సగం ప్యాంటు వచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫతేనగర్‌లో చోటుచేసుకుంది. తనకు వచ్చిన పార్శిల్ చూసి కస్టమర్ అవాక్కయ్యాడు. తాను ఒకటి పెడితో ఇంకొకటి డెలివరీ కావడమే కాకుండా సగం ప్యాంట్ రావడం చూసి షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఫతేనగర్‌కు చెందిన సర్ఫరాజ్ బక్రీద్ పండుగ నేపథ్యంలో ఇంట్లో వారికి ఈ నెల 12వ తేదీన ఆన్లైన్లో సల్వార్ కమీజ్ (పంజాబీ డ్రెస్) ఆర్డర్ పెట్టాడు. ఆదివారం సదరు కంపెనీ డెలివరీ బాయ్ ఆర్డర్ బాక్సును సర్ఫరాజ్‌కు అందిచాడు. రూ.413 చెల్లించి చూస్తే తీరా సగం ప్యాంటు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఒకటి ఆర్డర్పెడితే మరొకటి వచ్చిందని, అందులోనూ సగం ప్యాంటు రావడంపై బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తతంగమంతా డెలివరీ బాయ్ ఉన్నప్పుడే జరగడం గమనార్హం.
అయితే సగం ప్యాంట్ రావడమే కాదు తాను ఆర్డర్ చేసినప్పటి నుంచి షిప్పింగ్, డెలివరీ డేట్, డెలివరీ కంప్లీటెడ్ అలా ఏ అప్డేట్ తనకు రాలేదని సదరు కస్టమర్ వాపోయాడు. అలా అప్డేట్స్ ఏం రాకుండా ఎలా గూడ్స్ డెలవరీ చేస్తారని మండిపడ్డాడు. ఫేక్ డెలివరీ కంపెనీలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ ఆన్లైన్ మోసంపై సదరు వ్యక్తి నవీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.