బీఆర్ఎస్ వల్ల పెద్దపల్లి ప్రాంతం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ - lok sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 10, 2024, 9:47 AM IST
Peddapalli Congress MP Candidate Gaddam Vamshi Fires On BRS : పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకా మనవడు గడ్డం వంశీ కృష్ణను ఎంపిక చేయడంతో పార్లమెంట్ పరిధిలో ప్రచారం ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ సమావేశాలలో పాల్గొంటున్నారు. తాను రాజకీయాలకు కొత్త కావచ్చేమో కానీ ప్రజాసేవకు కొత్త కాదని వంశీకృష్ణ చెబుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వారసత్వం పుణికి పుచ్చుకున్నానని అన్నారు. అప్పట్లో కాకా చేసిన అభివృద్ధి ఇప్పడు తన గెలుపునకు సాయపడుతుందని తెలిపారు.
Peddapalli Congress MP Candidate Gaddam Vamshi Comments : పెద్దపల్లి ప్రాంతం బీఆర్ఎస్ పాలన వల్ల 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వంశీకృష్ణ విమర్శించారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలనను అంతం చేసి ప్రజాపాలనను సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు కేంద్రంలో కూడా అదే జరగబోతుందని, పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న వంశీకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.