నిజామాబాద్ ఎంపీ స్థానంలో పోటీకి బీఆర్ఎస్ భయపడుతోంది - కాంగ్రెస్కు అభ్యర్థులే లేరు : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి - MLA Maheshwar Reddy latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-01-2024/640-480-20612674-thumbnail-16x9-maheshwar-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 28, 2024, 9:20 PM IST
Parliamentary Incharge Nirmal MLA Maheshwar Reddy : పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని పార్లమెంటరీ ఇన్ఛార్జ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరవయ్యారని ఎద్దేవా చేశారు. అభ్యర్థులను అరువు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు భయపడుతున్నారన్నారు.
MLA Maheshwar Reddy Comments On BRS : గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పూర్తిగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ధర్మపురి అర్వింద్ రాష్ట్రానికి పసుపు బోర్డు తెచ్చి మాట నిలుపుకున్నారని మహేశ్వర్ రెడ్డి వివరించారు. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వరకు రైల్వే లైన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు.