విద్యార్థినుల బాత్​రూంలోకి చొరబడిన దుండగులు - రక్షణ కల్పించాలంటూ అమ్మాయిల ధర్నా - OU PG Women Hostel Incident

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 11:58 AM IST

OU PG Women's Hostel Incident : సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల హాస్టల్​లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓయూ పీజీ కాలేజ్ హాస్టల్​లో శనివారం తెల్లవారుజామున ముగ్గురు ఆగంతకులు గోడదూకి హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. స్నానాల గదిలోకి చొరబడి సైగలు చేశారు. వారిని గమనించిన విద్యార్థినులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పరారయ్యారు. మరో వ్యక్తి దొరకడంతో అతడికి విద్యార్థినులు దేహశుద్ధి చేసి బేగంపేట పోలీసులకు అప్పగించారు.

Secunderabad PG Women's Hostel Security Breach :  హాస్టల్​లో తమకు భద్రత కరవైందని, తమకు సరైన రక్షణ కల్పించాలంటూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి నిరసన తెలిపారు. సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీసీ వచ్చి తమకు సమాధానం చెప్పాలన్నారు.   స్పందించిన డీసీపీ రోహిణి ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డీసీపీ హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.