ఘనంగా న్యాల్కల్ ఉర్సు ఉత్సవం - ఎడ్ల జాతరలో రూ. లక్ష ధర పలికిన బసవన్న - Nyalkal Cattle Fair in Sangareddy
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 10:36 AM IST
Nyalkal Urs Festival in Sangareddy : జోడెడ్ల జాతరగా రాష్ట్ర స్థాయిలో పేరొందిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ ఉర్సు ఉత్సవం, పశుసంపదతో కళకళలాడింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ 357వ ఉర్సు వేడుకల్లో మూడో రోజు ఎడ్ల జాతర నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పశుపోషకులు వేలాదిగా ఎడ్లు, పాడి పశువులతో తరలిరావడంతో కనుచూపుమేర సందడిగా మారింది.
Nyalkal Cattle Fair in Sangareddy : ఓ ఎద్దు ఏకంగా లక్షా అరవై అయిదు వేల రూపాయల ధర పలికింది. జాతరలో లక్షన్నర నుంచి మూడున్నర లక్షల వరకు ధర పలికిన ఎద్దుల జోడులు అమ్ముడుపోయాయి. గత 18 సంవత్సరాలుగా న్యాల్కల్ గ్రామానికి చెందిన పశు ప్రేమికుడు హోతి బసవరాజు 'బసవ' పేరిట ఉత్తమ ఎడ్లు, పశు పోషకులను ఎంపిక చేసి జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకం అందజేశారు.