LIVE : హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ నుంచి ప్రత్యక్షప్రసారం - ntr birth anniversary - NTR BIRTH ANNIVERSARY
🎬 Watch Now: Feature Video
Published : May 28, 2024, 7:57 AM IST
|Updated : May 28, 2024, 8:21 AM IST
NTR 101 Birth Anniversary : తెలుగు జాతి కీర్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన మహనీయుడు, ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు. తెలుగు వారి గొంతును దిల్లీ పీఠం వరకు వినిపించేలా పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలలోనే అధికారంలో నిలిపి తనదైన ముద్రను వేసిన విలువలు ఉన్న రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్. నేడు ఆ యుగపురుషుని 101వ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన మనవళ్లు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంజలి ఘటించారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకుందామని చెప్పారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని తెలిపారు. వారితో పాటు కుటుంబ సభ్యులు సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
Last Updated : May 28, 2024, 8:21 AM IST